Peddapalli: పిపిసి కేంద్రాల్లో తనిఖీలు.. అధికారులకు కలెక్టర్ ఆదేశాలు
Peddapalli: పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సుల్తానాబాద్ మండలంలోని సుగ్లాంపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు.
Peddapalli: పిపిసి కేంద్రాల్లో తనిఖీలు.. అధికారులకు కలెక్టర్ ఆదేశాలు
Peddapalli: సుల్తానాబాద్ మండలంలోని సుగ్లాంపల్లి పిఎసిఎస్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్, రైతుల నుండి ధాన్యం కొనుగోలు పారదర్శకంగా, వేగవంతంగా జరగాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* అధికారులకు సూచించారు. సుల్తానాబాద్ మండలంలోని సుగ్లంపల్లి పిపిసి (Paddy Procurement Centre)ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఈ రోజు సందర్శించి, ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,రైతులు తీసుకువచ్చే ధాన్యం తప్పనిసరిగా ఎఫ్‌ఏక్యూ (FAQ - Fair Average Quality) ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడాలని తెలిపారు. కేంద్రాల్లో తూకం, తేమ శాతం కొలతలు సక్రమంగా నిర్వహించాలని, ఎలాంటి ఆలస్యం లేకుండా రైతులకు రశీదులు ఇవ్వాలని ఆదేశించారు.
అదేవిధంగా, ధాన్యం మిల్లులకు పంపించే ప్రక్రియలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఓపీఎంఎస్ (OPMS)లో వివరాలు సకాలంలో నమోదు చేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని పిపిసి ఇంచార్జ్‌లకు తెలిపారు. ఈ సందర్శనలో డి. ఎం.శ్రీకాంత్, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు, పాల్గొన్నారు.




