Peddapalli: ప్రతి ఇంట్లో అంబేద్కర్ చిత్రపటం ఉండాలి: దుర్గం నగేష్ దంపతులు!

Peddapalli: ప్రతి ఇంట్లో అంబేద్కర్ చిత్రపటం ఉండాలని, రాజ్యాంగ నిర్మాత ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సమతా సైనిక దళ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గం నగేష్ పిలుపునిచ్చారు.

VIJAY, RAMAGUNDAM
Published on: 25 Nov 2026 6:05 PM IST
Peddapalli
X

Peddapalli: ప్రతి ఇంట్లో అంబేద్కర్ చిత్రపటం ఉండాలి: దుర్గం నగేష్ దంపతులు!

Peddapalli: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సమతా సైనిక దళ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, సమతా ఫౌండేషన్, సమతా గ్రంథాలయ చైర్మన్ దుర్గం నగేష్, ప్రమీల దంపతులు పిలుపునిచ్చారు. బుధవారం పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన కవ్వాల నర్సయ్య, లక్ష్మీ దంపతుల గృహప్రవేశ వేడుకకు వారు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటాన్ని నర్సయ్య దంపతులకు బహూకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అంబేద్కర్ చిత్రపటం ప్రతి ఇంట్లో ఉండాలని, ఆయన జీవిత చరిత్ర, పోరాట స్ఫూర్తి, సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన కృషిని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం పట్ల అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

అంబేద్కర్ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని, ఆయన కలలుగన్న సమసమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పేర్కొన్నారు. శుభకార్యాల సందర్భంగా మహనీయుల చిత్రపటాలను బహూకరించడం ద్వారా వారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అనిల్ కుమార్, మల్లేష్, అనూష తదితరులు పాల్గొన్నారు.

VIJAY, RAMAGUNDAM

VIJAY, RAMAGUNDAM