Manthani: మంథనిలో పుట్ట మధు పర్యటన.. ఎమ్మెల్యేపై ఘాటు విమర్శలు!
Manthani: మంథని బస్టాండ్‌లో అకాల వర్షం వల్ల ఏర్పడిన బురద, నీటి నిల్వలను మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పరిశీలించారు.
Manthani: మంథనిలో పుట్ట మధు పర్యటన.. ఎమ్మెల్యేపై ఘాటు విమర్శలు!
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని డివిజన్ కేంద్రంలోని బస్టాండ్ ను మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సందర్శించారు. రెండు రోజుల క్రితం కురిసిన ఆకాల వర్షానికి బస్టాండ్ లోకి వరద నీరు చేరుకొని బురద మాయమైనా పరిస్థితిని పరిశీలించారు. సమీపంలో ఉన్న పరిసరాలను పరిశీలించి ప్రయాణీకులను వసతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పుట్ట మధు మాట్లాడుతూ...బిఆర్ఎస్ ప్రభుత్వంలో మంథని బస్టాండ్ ను కొన్ని కోట్లతో సుందికరణ చేశామని, పుట్ట లింగమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో బస్టాండ్ ఏరియాలో తల్లులు పాలిచ్చే గదిని నిర్మిస్తే వాటిని స్వార్థంతో మంథని ఎమ్మెల్యే తోలగించారని కనీసం పేరుకూడా లేకుండా చేశారని మండిపడ్డారు.
ఈ 30 నెలల్లో మంత్రి శ్రీధర్ బాబు మంథనిని అభివృద్ధి కాదు చీకటిగా మార్చాడని విమర్శించారు. ఎక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో అక్కడికి పుట్ట మధు వస్తే పనులు జరుగుతున్నాయని ప్రజలు అంటున్నారని పుట్ట మధు అన్నారు. పుట్ట మధు వెంబడి బిఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు.




