Karimnagar: రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం: రైతు దుర్మరణం
Karimnagar: కరీంనగర్ - పెద్దపల్లి రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. నిలిపి ఉంచిన లారీని ఢీకొని రేగడి మద్దికుంటకు చెందిన రైతు అంజయ్య మృతి.
Karimnagar: రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం: రైతు దుర్మరణం
కరీంనగర్ రూరల్: కరీంనగర్ పెద్దపల్లి రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం రైతు మృతి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంటకు చెందిన ఆవుల అంజయ్య అనే రైతు లారీని ఢీకొని మృతి చెందినట్లు తెలిపారు.
పెద్దపల్లి వైపు నుండి కరీంనగర్ వైపు వస్తున్న రైతు అంజయ్య రాజీవ్ రహదారిపై, ముగ్ధంపూర్ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల దాటిన కొద్ది దూరంలో రోడ్డు ప్రక రహదారి పై ఇటుకల లోడుతో నిలిపి ఉంచిన లారీ నం. TS 30 T 2295ను, తన పల్సర్ మోటార్ సైకిల్ నం. TG 22 7354పై కరీంనగర్ వైపు వస్తూ వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడి రోడ్డుపై పడిపోయాడు.
సమాచారం అందుకున్న వెంటనే కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డి సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని, కొనఊపిరితో ఉన్న గాయపడిన వ్యక్తిని 108 అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మృతదేహాన్ని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం మార్చురీకి తరలించి భద్రపరచడం జరిగిందని తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించబడిందన్నారు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ సంఘటన స్థలం నుండి పరారయ్యాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టబడుతుందని అన్నారు.




