Siricilla: గంభీరావుపేటలో రైతుల రాస్తారోకో..విద్యుత్ కోతలపై తీవ్ర ఆగ్రహం!
Siricilla: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగారం వద్ద కరెంటు కోతలను నిరసిస్తూ సిరిసిల్ల-కామారెడ్డి ప్రధాన రహదారిపై రైతుల రాస్తారోకో.
Siricilla: గంభీరావుపేటలో రైతుల రాస్తారోకో..విద్యుత్ కోతలపై తీవ్ర ఆగ్రహం!
Siricilla: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. గజసింగారం వద్ద సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారిపై రైతులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
గజసింగవరం, గోరంటాల, సముద్రలింగాపూర్, రాజేశ్వరరావు కాలనీకి చెందిన రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వరి పంట ప్రస్తుతం పొట్ట దశలో ఉందని, ఈ సమయంలో విద్యుత్ కోతల కారణంగా పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు అవసరమైన మేరకు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించాలని డిమాండ్ చేశారు.
రైతుల బైఠాయింపుతో సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. పంటలకు సరిపడా విద్యుత్ అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.




