Gambhiraopet: భూముల రీసర్వేపై రైతులు అవగాహన పెంచుకోవాలి: అదనపు కలెక్టర్

Gambhiraopet: గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లిలో భూముల రీసర్వేను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించారు. రైతుల సమక్షంలో పారదర్శకంగా సర్వే చేయాలని ఆదేశించారు.

KALEEM, SIRICILLA
Published on: 11 Nov 2026 5:07 PM IST
Gambhiraopet
X

Gambhiraopet: భూముల రీసర్వేపై రైతులు అవగాహన పెంచుకోవాలి: అదనపు కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా: గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ బుధవారం సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూముల రీసర్వేపై రైతులు కనీస అవగాహన పెంచుకోవాలని, క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించే సమయంలో అధికారులకు సహకరించాలని సూచించారు.

రీసర్వే బృందాలు భూములకు సంబంధించిన వివరాలను పూర్తి ఖచ్చితత్వంతో సేకరించాలని, రైతులకు సర్వే ప్రక్రియపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమక్షంలో పారదర్శకంగా రీసర్వే నిర్వహించాలని స్పష్టం చేశారు.

మరోవైపు ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలు, వ్యవసాయ అధికారుల సూచనలను రైతులు పాటించాలని అదనపు కలెక్టర్ కోరారు. వరి సాగుకు బదులుగా ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. జిల్లాలో ఆయిల్‌పామ్, వివిధ రకాల కూరగాయల పంటలు సాగు చేస్తూ లాభాలు పొందుతున్న రైతుల అనుభవాలను తెలుసుకొని, అనుకూలమైన పంటలను సాగు చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మారుతి రెడ్డి, సర్వేయర్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA