Veernapalli: యాప్ వద్దు - పాత పద్ధతే ముద్దు.. రోడ్డెక్కిన వీర్నపల్లి రైతులు!
Veernapalli: వీర్నపల్లి మండల కేంద్రంలో యూరియా పంపిణీ కోసం ప్రవేశపెట్టిన నూతన యాప్ విధానాన్ని వ్యతిరేకిస్తూ రైతులు ప్లకార్డులతో నిరసన చేపట్టారు.
Veernapalli: యాప్ వద్దు - పాత పద్ధతే ముద్దు.. రోడ్డెక్కిన వీర్నపల్లి రైతులు!
వీర్నపల్లి: వీర్నపల్లి మండల కేంద్రంలో యూరియా పంపిణీకి తీసుకొచ్చిన యాప్ విధానాన్ని వ్యతిరేకిస్తూ రైతులు నిరసన చేపట్టారు. యాప్‌ను వెంటనే రద్దు చేసి, గతంలో మాదిరిగానే నేరుగా దుకాణాల్లో యూరియా విక్రయాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ముఖ్యంగా చదువురాని రైతులు, స్మార్ట్‌ఫోన్ లేని వారు యాప్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాప్ విధానం వల్ల ఎరువుల కొనుగోలులో జాప్యం జరుగుతోందని, సాగు పనులు ప్రభావితమవుతున్నాయని రైతులు ఆరోపించారు.
ఇదే సమయంలో దుక్కి మందు సంచుల ధరలు పెరగడంపై కూడా రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
Next Story




