Sircilla: నామాపూర్‌లో సన్నధాన్యం ధర తగ్గింపుపై రైతుల ఆందోళన!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా నామాపూర్‌లో ధాన్యం ధర తగ్గింపుపై రైతుల రోడ్డు దిగ్బంధం. క్వింటాలుకు రూ.500 తగ్గించడంపై ఆగ్రహం. అధికారుల హామీతో ఆందోళన విరమణ.

KALEEM, SIRICILLA
Published on: 22 Oct 2026 2:11 PM IST
Sircilla
X

Sircilla: నామాపూర్‌లో సన్నధాన్యం ధర తగ్గింపుపై రైతుల ఆందోళన!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్‌లో సన్నధాన్యం ధర తగ్గింపుపై రైతులు ఆందోళనకు దిగారు. వారం రోజుల క్రితం క్వింటాల్ సన్నధాన్యానికి రూ.3,200 ధర పలకగా, ప్రస్తుతం రూ.2,700కే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాల్‌కు ఏకంగా రూ.500 తగ్గించడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని పేర్కొన్నారు.

పంట సాగు కోసం పెట్టుబడులు పెట్టి, ఆరుగాలం కష్టపడి ధాన్యం పండించినా గిట్టుబాటు ధర దక్కడం లేదని రైతులు వాపోయారు. మిల్లర్లు సిండికేట్‌గా మారి ధర తగ్గించి ధాన్యం కొనుగోలు చేస్తున్నారని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రెండు గంటలకు పైగా ఆందోళన కొనసాగించారు.

సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. అనంతరం రైతులను శాంతింపజేసి ఆందోళన విరమింపజేశారు. ధాన్యం ధర తగ్గింపుపై అధికారులు స్పందించి, తమకు న్యాయమైన ధర లభించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA