Manthani: కరెంట్ కోతలను నిరసిస్తూ మంథని-కాటారం రహదారిపై రైతుల రాస్తారోకో!
Manthani: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్‌పూర్‌లో కరెంట్ కోతలను నిరసిస్తూ మంథని-కాటారం ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో మరియు ఆందోళన.
Manthani: కరెంట్ కోతలను నిరసిస్తూ మంథని-కాటారం రహదారిపై రైతుల రాస్తారోకో!
Manthani: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్‌పూర్ వద్ద రైతులు సక్రమంగా విద్యుత్ సరఫరా లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని రోడ్డుపైన రాస్తారోకో నిర్వహించి ఆందోళనకు దిగారు.
కరెంట్ కోతల కారణంగా పంట పొలాలు ఎండిపోతున్నాయని ఈ సందర్భంగా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు సరిపడా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువ ద్వారా సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
రైతుల రాస్తారోకోతో మంథని–కాటారం ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న మంథని పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. రాస్తారోకో విరమించాలని పోలీసులు కోరగా, తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కొందరు రైతులు పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో విద్యుత్, సాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు.




