Vemulawada: రోడ్డుపై చెత్త వేస్తే జరిమానా తప్పదు: మున్సిపల్ కమిషనర్ లోకేష్!

Vemulawada: రోడ్డుపై చెత్త వేస్తే జరిమానా తప్పదని వేములవాడ మున్సిపల్ కమిషనర్ లోకేష్ హెచ్చరించారు. రెండో బైపాస్ రోడ్డులో కొబ్బరి బోండాల వ్యాపారికి రూ.1,000 ఫైన్ వేశారు.

BABU, VEMULAWADA
Published on: 25 Nov 2026 7:35 PM IST
Vemulawada
X

Vemulawada: రోడ్డుపై చెత్త వేస్తే జరిమానా తప్పదు: మున్సిపల్ కమిషనర్ లోకేష్!

Vemulawada: రోడ్డుపై చెత్త వేస్తే జరిమానా తప్పదు. రెండో బైపాస్ రోడ్డులో కొబ్బరి బోండాల వ్యాపారికి రూ.1,000 జరిమానా. పట్టణ పరిశుభ్రతకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: మున్సిపల్ కమిషనర్ లోకేష్ గారు. చెత్తను మున్సిపల్ వాహనాల్లోనే వేయాలి : సానిటరీ ఇన్స్పెక్టర్ సుకుమార్.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారు మాట్లాడుతూ సంబంధిత వ్యక్తి చిరు వ్యాపారి అయినందున, ఆ వ్యక్తికి మొదటిసారే ఫైన్ వెయ్యకుండా మా మున్సిపల్ సిబ్బంది ఇప్పటికే రెండు మూడు సార్లు హెచ్చరించడం జరిగిందని అయినా ఆ చిరు వ్యాపారి తీరు మార్చుకోలేదని ఈరోజు కూడా రోడ్డుపై ఇష్టానుసారంగా చెత్తాచెదారాన్ని వేస్తూ వాహనదారులకు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాడని మా మున్సిపల్ సిబ్బంది కొబ్బరి బొండాల వ్యాపారికి జవాన్ బట్టు శ్రీకాంత్ 1000 రూపాయల జరిమానా విధించడం జరిగిందని చెత్తను రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వేయకుండా మున్సిపల్ చెత్త సేకరణ వాహనాల్లోనే వేయాలని వారు సూచించారు.

చెత్త సేకరణలో ఏవైనా సమస్యలు ఎదురైతే సంబంధిత వార్డు జవాన్లు లేదా మున్సిపల్ కార్యాలయానికి సమాచారం అందించాలని కోరారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు స్వచ్ఛ వేములవాడ సాధనే లక్ష్యంగా మున్సిపాలిటీ పనిచేస్తోందని, పట్టణ పరిశుభ్రతలో వ్యాపారులు, ప్రజలు భాగస్వాములై అధికారులకు సహకరించాలని కమిషనర్ లోకేష్ గారు కోరారు.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA