Karimnagar: టవర్ సర్కిల్‌లో భారీ అగ్నిప్రమాదం!
Karimnagar: కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద భారీ అగ్నిప్రమాదం జరిగింది. పద్మావతి జువెలరీ షాప్‌లో తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది.
Karimnagar: టవర్ సర్కిల్‌లో భారీ అగ్నిప్రమాదం!
Karimnagar: కరీంనగర్ టవర్ సర్కిల్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టవర్ వద్ద గల పద్మావతి జువెలరీ షాప్ లో తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుని మంటలు చెలరేగడంతో గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు ఫైర్ సిబ్బందికి షాప్ యజమానికి సమాచారం ఇచ్చారు.
పోలీసులు ఫైర్ సిబ్బంది సకాలంలో చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆస్తి నష్టం సంభవించి యజమాని బోరున ఏడుస్తున్నాడు ప్రమాదానికి సంబంధించిన ఘటనపై పోలీసులు ఫైర్ అధికారులు విచారణ చేపట్టారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా మరి ఏదైనా కారణం ఉందా అని లోతుగా విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు.
Next Story




