Narayanapur: ఇండ్ల మధ్య రేగిన మంటలు.. సకాలంలో అదుపు చేసిన ఫైర్ సిబ్బంది

Narayanapur: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలోని ఇండ్ల మధ్య ఉన్న పశువుల పాకలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది.

KALEEM, SIRICILLA
Published on: 12 Jun 2026 7:42 PM IST
Narayanapur
X

Narayanapur: ఇండ్ల మధ్య రేగిన మంటలు.. సకాలంలో అదుపు చేసిన ఫైర్ సిబ్బంది

Narayanapur: ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఇండ్ల మధ్యలో ఉన్న పశువుల పాకలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీగా నిల్వ ఉంచిన పశుగ్రాసం అగ్నికి ఆహుతైంది. మంటలు వేగంగా వ్యాపించడంతో పాకలో ఉన్న ఎడ్ల బండి, వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్‌కు సంబంధించిన సామగ్రి పూర్తిగా కాలిపోయాయి.

ఇండ్ల నడుమ మంటలు ఎగసిపడటంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందితో ఫైర్ ఇంజన్‌ను ఘటనాస్థలికి పంపించారు. సిబ్బంది సకాలంలో మంటలను అదుపులోకి తీసుకురావడంతో సమీపంలోని ఇళ్లకు మంటలు వ్యాపించకుండా పెద్ద ప్రమాదం తప్పింది.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story