Karimnagar: కరీంనగర్‌లో తొలి ఇందిరమ్మ ఇల్లు రెడీ.. గృహప్రవేశం చేసిన లబ్ధిదారులు!
Karimnagar: కరీంనగర్ కార్పొరేషన్ 17వ డివిజన్ కొత్తపల్లిలో పూర్తయిన మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లును సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రారంభించారు.
Karimnagar: కరీంనగర్‌లో తొలి ఇందిరమ్మ ఇల్లు రెడీ.. గృహప్రవేశం చేసిన లబ్ధిదారులు!
కరీంనగర్: కరీంనగర్ కార్పోరేషన్ కొత్తపల్లి 17 వ డివిజన్ లో పూర్తయిన మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు లబ్ధి దారులు పెంటి శ్రీలత శ్రీకాంత్ ఇందిరమ్మ ఇల్లును సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి గృహ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇల్లు లేని ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నదే రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. మొదటి విడతలో మంజూరైన లబ్దిదారులు పోను ఇంకా మిగిలిపోయిన లబ్ధిదారులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్, చిలుక హన్మంత రెడ్డి, గున్నాల రమేష్, చింతల శ్రీనివాస్ రెడ్డి, జేరిపోతుల వాసు, యాస్వాడ రాజకుమార్, కొండం శ్రీనివాస్, సంగం మునిందర్, రాపర్తి రాజు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




