Peddapalli: జర్నలిస్టుల హామీలను నెరవేర్చాలి: అల్లం నారాయణ!
Peddapalli: జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు, అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని పెద్దపల్లిలో అల్లం నారాయణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Peddapalli: జర్నలిస్టుల హామీలను నెరవేర్చాలి: అల్లం నారాయణ!
పెద్దపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని, హెల్త్ కార్డులను పునరుద్ధరించాలని తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్, టీయూడబ్ల్యూజే హెచ్ (143) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ అన్నారు.
గురువారం అయన జిల్లాలోని తన స్వగ్రామం వంతనికి వెళ్లి హైదరాబాద్ తిరిగి వెళుతున్న సమయంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు ఇవ్వాలని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను అందించాలన్నారు.
ఇచ్చిన హామీ ప్రకారం జర్నలిస్టు సంక్షేమ నిధిని రూ. 200ల కోట్లకు పెంచాలని, త్వరలో జిల్లా స్థాయి రాష్ట్రస్థాయి టియుడబ్ల్యుజే మహాసభలను నిర్వహిస్తామన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ జర్నలిస్ట్ సంక్షేమ నిదికి ఇచ్చిన 42 కోట్లకు కాంగ్రెస్ మూడేండ్ల కాలం లో ఒక్క రూపాయి కూడా జమ చేయలేదన్నారు. గత ప్రభుత్వం మరణించిన జర్నలిస్ట్ కుటుంబానికి
లక్ష రూపాయలు ఇచ్చిందని గుర్తు చేశారు. దాన్ని లక్ష రూపాయలు నుంచి 2 లక్షలకు రూపాయలకు పెంచి ఇస్తామని చెప్పినా ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు. ఆ రెండు లక్షలకు పెంచుతామన్న హామీని అమలు చేయాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో హౌసింగ్ సొసైటీ ద్వారా 60% మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇంతవరకు అసలు ఇళ్ల స్థలాలు ఇప్పించలేదన్నారు.
త్వరలో TuwJ జిల్లా కార్యవర్గాలను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా స్థాయి సమావేశాలతో పాటు రాష్ట్ర స్థాయి మహాసభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా అల్లం నారాయణను జిల్లాలోని జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొట్టె సదానందం, టీయూడబ్ల్యూజే (ఐజేయుహెచ్ 143) నేషనల్ కౌన్సిల్ మెంబర్ అంకరి ప్రకాష్, కాల్వ రమేష్, నరేంద్ర చారి, శిలారపు కిషన్, కొయ్యడ తిరుపతి, తూర్పాటి శ్రీనివాస్, దొమ్మటి రాజేష్, కత్తెర్ల తిరుపతి, తిర్రి తిరుపతి, మేకల సంతోష్, కళ్యాణ్, సతీష్, తిర్రి సుధాకర్, లక్ష్మణ్, తిర్రి శంకర్, అంజయ్య, రాజు యాదవ్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.




