Manthani: బీఆర్ఎస్ నాయకుడి తండ్రి అంతిమయాత్రలో పాడె మోసిన మాజీ ఎమ్మెల్యే!
Manthani: మంథని బీఆర్ఎస్ నాయకుడు పుప్పాల తిరుపతి తండ్రి రామయ్య అంతిమయాత్రలో పాల్గొని, స్వయంగా పాడె మోసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు.
Manthani: బీఆర్ఎస్ నాయకుడి తండ్రి అంతిమయాత్రలో పాడె మోసిన మాజీ ఎమ్మెల్యే!
Manthani: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పుప్పాల తిరుపతి తండ్రి రామయ్య మృతి చెందడంతో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, ఆయన సతీమణి శైలజ వారి కుటుంబాన్ని పరామర్శించారు. రామయ్య పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం నిర్వహించిన అంతిమయాత్రలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుట్ట మధూకర్ స్వయంగా పాడె మోస్తూ అంత్యక్రియల్లో భాగస్వాములయ్యారు. మృతుడి కుటుంబ సభ్యులతో కలిసి అంతిమయాత్రలో నడుస్తూ వారికి మనోధైర్యం కల్పించారు.
రామయ్య మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన పుట్ట మధు, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కష్టసుఖాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వారి కుటుంబాలకు అండగా ఉంటామని ఈ సందర్భంగా భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని రామయ్యకు కన్నీటి వీడ్కోలు పలికారు.




