Putta Madhu: కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటే.. ఎమ్మెల్యేపై దాడి హేయం: మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మండిపాటు
Putta Madhu: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి బీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తున్నాయని మంథనిలో విలేకరుల సమావేశంలో ఆరోపించారు.
Putta Madhu: కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటే.. ఎమ్మెల్యేపై దాడి హేయం: మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మండిపాటు
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్ట మధు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతల అండదండలతోనే బిజెపి దుండగులు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పై దాడి చేయడం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేస్తే దాడి చేయడమే కాంగ్రెస్ బిజెపి నాయకుల వైఖరిని పుట్ట మధు ఖండించారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు రెండు ఒకటేనని తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజల భవిష్యత్తు కోసం పోరాటం చేసేది ఒక బిఆర్ఎస్ పార్టీ మాత్రమేనని పుట్ట మధు అన్నారు.
Next Story




