Karimnagar: సీఎం తీరుపై మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ఫైర్!

Karimnagar: కరీంనగర్‌లో జరిగిన రైతు ఆశీర్వాద సభ అట్టర్ ఫ్లాప్ అయిందని, సీఎం స్థాయికి తగని రీతిలో మాట్లాడుతున్నారని రవిశంకర్ విమర్శించారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 11 July 2026 12:42 PM IST
Karimnagar
X

Karimnagar: సీఎం తీరుపై మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ఫైర్!

కరీంనగర్: రైతాంగాన్ని మరోసారి మోసం చేసేందుకే ప్రభుత్వం సభలు నిర్వహిస్తోందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ధ్వజమెత్తారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులకు కిరాయిలు కూడా ఇవ్వకుండా, మహిళా సంఘాల ద్వారా షో చేయాలని చూసినా 'రైతు ఆశీర్వాద సభ' అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు.

సభలో 25 వేల కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయని, అసలు అక్కడ రైతులే లేరని ఎద్దేవా చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగని రీతిలో చిల్లరగా మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణకు కేసీఆరే అసలైన రక్షకుడని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమైందని, రైతాంగం అల్లాడుతోందని మండిపడ్డారు.

కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి తక్షణమే నీటిని విడుదల చేసి మిడ్ మానేరుతో పాటు ఇతర జలాశయాలను నింపాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 50 వేల మందితో పంప్ హౌస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story