Sircilla: కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో అమర జవాన్లకు ఘన నివాళి!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి.
Sircilla: కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో అమర జవాన్లకు ఘన నివాళి!
సిరిసిల్ల: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కార్గిల్ లేక్ వద్ద వైజయంతి యుద్ధ ట్యాంక్ సమీపంలో అమర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడెపు రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 1999 కార్గిల్ యుద్ధంలో దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన 527 మంది వీర జవాన్ల సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆడెపు రవీందర్.. కార్గిల్ యుద్ధంలో భారత సైనికులు ప్రదర్శించిన అసాధారణ ధైర్యసాహసాలు దేశ ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. అమరుల త్యాగాన్ని ప్రతి భారతీయుడు గౌరవించాలని, వారి దేశభక్తి భావనను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.అనంతరం సిరిసిల్ల పట్టణానికి చెందిన మాజీ భారత సైనికులను శాలువాలతో సన్మానించి వారి సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ ఎర్రం వెంకట్రాజం, ఎర్రం మహేష్, శీలం రాజు, నవీన్ యాదవ్, నాగుల శ్రీనివాస్, గాజుల వేణు, వేముల వైశాలి, మోర శ్రీహరి, అంకారాపు రాజు, చేపూరి అశోక్‌తో పాటు మాజీ సైనికులు, పట్టణ ప్రముఖులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




