Manthani: మంథనిలో మాజీ సర్పంచ్‌ల అరెస్ట్ ‘ఛలో అసెంబ్లీ’ భగ్నం!

Manthani: మంథనిలో మాజీ సర్పంచ్‌ల ముందస్తు అరెస్ట్. 'ఛలో అసెంబ్లీ' ముట్టడిని అడ్డుకున్న పోలీసులు, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్.

SHANKAR, MANTHANI
Published on: 9 Sept 2026 1:00 PM IST
Manthani
X

Manthani: మంథనిలో మాజీ సర్పంచ్‌ల అరెస్ట్ ‘ఛలో అసెంబ్లీ’ భగ్నం!

Manthani: గ్రామ పంచాయతీలకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సర్పంచ్‌ జేఏసీ పిలుపునిచ్చిన ‘ఛలో అసెంబ్లీ–ముట్టడి’ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని పోలీసులు పలువురు మాజీ సర్పంచ్‌లను బుధవారం తెల్లవారుజామున ముందస్తుగా అరెస్ట్‌ చేశారు.

మాజీ సర్పంచ్‌ల జేఏసీ అధ్యక్షుడు కనవేన శ్రీనివాస్‌, కాకర్లపల్లి మాజీ సర్పంచ్‌ కనవే కొమురయ్య, గాజులపల్లి తాజా, మాజీ సర్పంచ్‌ కరెంగుల సుధాకర్‌, మల్లేపల్లి మాజీ సర్పంచ్‌ ఎరుకల తిరుపతమ్మ, తిరుపతిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా కనవేన శ్రీనివాస్‌ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులను చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మాటలు చెప్పడం తప్ప బిల్లులు చెల్లించడంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రివర్గం స్పందించి గ్రామ పంచాయతీల పెండింగ్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు బాధ్యతలు చేపట్టి తొమ్మిది నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు విడుదల కాకపోవడం సిగ్గుచేటని ఆయన తీవ్రంగా విమర్శించారు. మాజీ, ప్రస్తుత సర్పంచ్‌ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story