Karimnagar: కార్మిక పక్షపాతి కాకా వెంకటస్వామి: కొరివి వేణుగోపాల్!

Karimnagar: కార్మికుల సంక్షేమం, తెలంగాణ సాధనలో మాజీ కేంద్రమంత్రి కాకా వెంకటస్వామి పాత్ర చిరస్మరణీయమని ప్రజా మిత్ర ప్రోగ్రెస్ డెమోక్రటిక్ ఫ్రంట్ నేత కొరివి వేణుగోపాల్ అన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 5 Oct 2026 6:23 PM IST
Karimnagar
X

Karimnagar: కార్మిక పక్షపాతి కాకా వెంకటస్వామి: కొరివి వేణుగోపాల్!

కరీంనగర్: దేశంలో కార్మికులకు ఎనలేని సేవలు చేసిన గొప్ప వ్యక్తి మాజీ కేంద్రమంత్రి వెంకటస్వామి( కాకా ) అని ప్రజా మిత్ర ప్రోగ్రెస్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు. సోమవారం ఆయన 97వ జయంతి సందర్భంగా కరీంనగర్ కోర్టు వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి మొదట పూలమాల వేసిన అనంతరం, కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటస్వామి అమర హై అంటూ నినాదాలు చేశారు.

అనంతరం కొరివి వేణుగోపాల్ మాట్లాడుతూ ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లేబర్ మంత్రిగా, కేంద్ర లేబర్ మంత్రిగా పనిచేసిన కాలంలో కార్మికుల కు సంబంధించిన ఎన్నో సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు.

ప్రావిడెంట్ ఫండ్ విషయంలో గాని, సింగరేణి కాలరీస్ ఉద్యోగులకు రావలసిన గ్రాటిట్యూడ్ విషయంలో గాని, మూతపడ్డ ఎఫ్ సి ఐ ని తెరిపించడంలో ఆయన కృషి ఎనలేనిదని అన్నారు. భారతదేశవ్యాప్తంగా ఆయన కార్మికులకు చేసిన ఎన్నో సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.

హైదరాబాదులో ఇల్లు లేని పేదలకు దాదాపు 70 వేల మందికి ప్రభుత్వం తరఫున ఇల్లు కట్టించడం ఆ కాలంలో జరిగిందన్నారు. రాజకీయ రంగంలో పెద్దపల్లి పార్లమెంటులో ఆయన అప్పుడు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏడుగురు అభ్యర్థులకు టికెట్లు ఇప్పించి వారి నాయకత్వంలోనే మొత్తం ఎన్నికల క్యాంపు అంత ఆయన కను సన్నాల్లోనే జరిగేదన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఆయన కీలక పాత్ర వహించి కెసిఆర్ ను ఢిల్లీకి తీసుకుపోయి సోనియా గాంధీకి, ఢిల్లీ నాయకత్వానికి పరిచయం చేయడం జరిగింది అన్నారు. ఇక్కడ వైఎస్ఆర్ సీఎంగా తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ప్రభుత్వంపై తెలంగాణ గురించి ఒత్తిడి తీసుకురావడంలో ఆయన కృషి ఎంతగానో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గజ్జల ఆనందరావు, చిగిరి శ్రీధర్, పాటకుల భూమయ్య, కొంపల్లి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN