Karimnagar: కరీంనగర్‌లో ఘనంగా అయోధ్య, కాశీ ఉచిత యాత్ర ప్రారంభం!

Karimnagar: కరీంనగర్‌లో గంప నారాయణ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైశ్య నిరుపేద భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత అయోధ్య, కాశీ యాత్రను ఎమ్మెల్యే, మేయర్ ప్రారంభించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 25 Oct 2026 2:08 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో ఘనంగా అయోధ్య, కాశీ ఉచిత యాత్ర ప్రారంభం!

Karimnagar: కరీంనగర్ నగరంలోని వైశ్య భవన్ వద్ద గంప నారాయణ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైశ్య నిరుపేద భక్తుల కోసం ఏర్పాటు చేసిన అయోధ్య, కాశీ ఉచిత యాత్ర కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది.

ఈ కార్యక్రమానికి మానకొండూర్ శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ మరియు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఊపి యాత్రను ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గంప శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యాత్ర మూడో సంవత్సరానికి చేరుకుందని అభినందించారు. వైశ్య నిరుపేద భక్తుల కోసం గంప శ్రీనివాస్ తన సొంత ఖర్చులతో ఈ యాత్రను ఏర్పాటు చేశారని.. సుమారు 8 రోజుల పాటు సాగే ఈ యాత్ర కోసం ప్రత్యేకంగా రెండు బస్సులను ఏర్పాటు చేసి, దాదాపు 45 కుటుంబాల సభ్యులను అయోధ్య, కాశీ క్షేత్రాలకు ఉచితంగా తీసుకెళ్తున్నారని తెలిపారు.

యాత్రకు బయలుదేరిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి, ఈ యాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారని అన్నారు. అయోధ్య రాముడు మరియు కాశీ విశ్వేశ్వరుని ఆశీస్సులతో భక్తుల యాత్ర సుఖంగా సాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎన్నం ప్రకాష్, గాజ శివరాం, వైశ్య సంఘం ప్రతినిధులు, బిజెపి నాయకులు మరియు యాత్రకు బయలుదేరిన భక్తులు, నిర్వాహకులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN