Karimnagar: కొమురయ్య జయంతి వేళ వినూత్న సేవ.. మండుతున్న ఎండల్లో మజ్జిగ వితరణ

Karimnagar: కరీంనగర్ విద్యానగర్‌లో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య 99వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 April 2026 12:06 PM IST
Karimnagar
X

Karimnagar: కొమురయ్య జయంతి వేళ వినూత్న సేవ.. మండుతున్న ఎండల్లో మజ్జిగ వితరణ

కరీంనగర్: నగరంలోని విద్యానగర్ బీరప్ప కామన్ వద్ద శ్రీ దొడ్డి కొమురయ్య 99వ జయంతి వేడుకలను బీరప్ప కుర్మ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్ , డిప్యూటీ మేయర్, రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి యాదగిరి సునీల్ రావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి వారు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య ఆశయాలను స్మరించుకున్నారు.

అనంతరం దొడ్డి కొమురయ్య జయంతి పురస్కరించుకొని మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండుతున్న ఎండలవేల ఆయన జయంతిని పురస్కరించుకొని పాదాచారుల దాహార్తి తీర్చడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం అన్నారు.

ఈ కార్యక్రమంలో కర్రె అనిల్ - పద్మ 48వ డివిజన్ కార్పొరేటర్,ఎన్నం ప్రకాష్ - లక్ష్మి 49వ డివిజన్ కార్పొరేటర్,గాజ శివరాం - రమ 47వ డివిజన్ కార్పొరేటర్,21వ డివిజన్ కార్పొరేటర్ వి. నరసింగం, మాజీ కార్పొరేటర్లు, కురుమ సంఘం సభ్యులు, కుల పెద్దలు మరియు యువజన సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story