Sultanabad: 18 ఏళ్లుగా ఉచిత మట్టి గణపతుల పంపిణీ: తుమ్మ రాజ్ కుమార్

Sultanabad: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్త తుమ్మ రాజ్ కుమార్ ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేశారు.

Srimanthula Kondal, Peddapalli
Published on: 13 Sept 2026 6:01 PM IST
Sultanabad
X

Sultanabad: 18 ఏళ్లుగా ఉచిత మట్టి గణపతుల పంపిణీ: తుమ్మ రాజ్ కుమార్

పెద్దపల్లి జిల్లా: సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీ నగర్ లో సామాజిక కార్యకర్త తుమ్మ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణనాథులను ప్రజలకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా తుమ్మ రాజ్ కుమార్ మాట్లాడుతూ..

విఘ్నేశ్వర నవరాత్రులలో మట్టి గణపతిని ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడుకుందాం అని అన్నారు. గత 18 సంవత్సరాల నుండి యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆనందోత్సాహాల మధ్య ఎలాంటి అల్లర్లు లేకుండా శాంతి యుతంగా అందరూ నవరాత్రులు జరుపుకోవాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో యువ సంకల్ప ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి తుమ్మనిశాంత్, ముఖ్య సభ్యులు విశ్వనాధ్, గాలిపెల్లి కుమార్, చాతల శివ, నిఖిలేష్, శ్రీమణి ఉద్భవ్, నీరజ్ కుమార్, ఇంద్ర తదితరులు పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli