Karimnagar: కరీంనగర్‌లో మైనారిటీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ!
Karimnagar: కరీంనగర్ లో నిరుపేద ముస్లిం మైనారిటీ మహిళలకు ఉచిత కుట్టుమిషన్ల పంపిణీ. మహిళల సాధికారత, స్వయం ఉపాధికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని వైద్యా నికేతన్.
Karimnagar: కరీంనగర్‌లో మైనారిటీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ!
Karimnagar: కరీంనగర్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మహిళా సాధికారతలో భాగంగా కరీంనగర్ లో నిరుపేద ముస్లిం మైనారిటీ మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ వృత్తి ద్వారా మహిళలు స్వయం ఉపాధితో ఆర్థిక అభివృద్ధి సాధించాలని మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టనుందని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ ఎస్.ఏ. మొహ్సిన్, నగర కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు అహ్మద్ అలీ, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ షమీ, 64 డివిజన్ కార్పొరేటర్ పడాల అజయ్ గౌడ్, నాయకులు, సయ్యద్ హబీబుద్దీన్, మహమ్మద్ అర్షద్ అలీ, షాబాజ్, మహమ్మద్ ఇమ్రాన్, ఇమ్రాన్ ఘనీ, మాజిద్, షానవాజ్ తదితరులు పాల్గొన్నారు.




