Sircilla: ఎస్సీ నిరుద్యోగులకు ఎస్ఐ, కానిస్టేబుల్ ఉచిత శిక్షణ

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు అక్టోబర్ 30న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు.

KALEEM, SIRICILLA
Published on: 27 Oct 2026 6:48 PM IST
Sircilla
X

Sircilla: ఎస్సీ నిరుద్యోగులకు ఎస్ఐ, కానిస్టేబుల్ ఉచిత శిక్షణ

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న సబ్‌-ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ), పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలకు సంబంధించి అర్హులైన ఎస్సీ నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత ప్రిలిమినరీ రెసిడెన్షియల్ శిక్షణ అందించేందుకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు డీఎస్సీడీఓ (ఎస్సీడీడీ) ఎఫ్‌ఏసీ ఎం. విజయలక్ష్మి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అక్టోబర్ 30న స్పాట్ అడ్మిషన్లు ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచిత ప్రిలిమినరీ రెసిడెన్షియల్ శిక్షణ పొందేందుకు ఆసక్తి ఉన్న ఎస్సీ అభ్యర్థులు 2026 అక్టోబర్ 30వ తేదీ ఉదయం 10 గంటలకు నేరుగా హాజరుకావాలని అధికారులు సూచించారు. అభ్యర్థుల ఎంపిక డిగ్రీ మార్కుల ఆధారంగా చేపట్టనున్నట్లు తెలిపారు.

స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ సిద్దిపేట బైపాస్ రోడ్డులోని అంబేద్కర్ భవన్ సమీపంలో ఉన్న టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నారు.

సమర్పించాల్సిన ధ్రువపత్రాలు

అభ్యర్థులు దరఖాస్తుతో పాటు కింది ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలను సమర్పించాలి.

- ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ రిజిస్ట్రేషన్ ఫారం

- పదో తరగతి మార్కుల జాబితా

- ఇంటర్మీడియట్ సర్టిఫికేట్

- డిగ్రీ సర్టిఫికేట్

- టీసీ (ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్)

- కుల ధ్రువీకరణ పత్రం

- ఆదాయ ధ్రువీకరణ పత్రం

- రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు

- ఆధార్ కార్డు

ధ్రువపత్రాలను టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్, రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవ డైరెక్టర్‌కు సమర్పించాల్సి ఉంటుంది.

మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:

9908352073, 8341387700

అర్హులైన ఎస్సీ నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని వినియోగించుకోవాలని డీఎస్సీడీఓ (ఎస్సీడీడీ) ఎఫ్‌ఏసీ ఎం. విజయలక్ష్మి కోరారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA