Sircilla: ఎస్టీ, ఎస్సీ, బీసీలకు ఉచిత సివిల్స్ కోచింగ్: సిరిసిల్ల డీటీడీవో

Sircilla: యూపీఎస్సీ సివిల్స్–2027 అభ్యర్థులకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ రాజేంద్రనగర్‌లో ఉచిత శిక్షణ కల్పిస్తోంది. దరఖాస్తులకు ఈ నెల 23 చివరి తేదీ.

KALEEM, SIRICILLA
Published on: 21 Sept 2026 6:13 PM IST
Sircilla
X

Sircilla: ఎస్టీ, ఎస్సీ, బీసీలకు ఉచిత సివిల్స్ కోచింగ్: సిరిసిల్ల డీటీడీవో

సిరిసిల్ల: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష–2027కు సిద్ధమవుతున్న ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఉచిత శిక్షణ అందించనుంది. రాజేంద్రనగర్‌లోని గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లో శ్రీరామ్స్ ఐఏఎస్ కోచింగ్ సంస్థ సహకారంతో రెసిడెన్షియల్ విధానంలో ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ ఇవ్వనున్నారు.

శిక్షణకు అర్హత ఉన్న అభ్యర్థులను ఆబ్జెక్టివ్ టైప్, ఆప్టిట్యూడ్ పరీక్షల ద్వారా ఎంపిక చేయనున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కె. సంగీత తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించకూడదని పేర్కొన్నారు.

అర్హత కలిగిన అభ్యర్థులు welfare.sriramsias.com వెబ్‌సైట్‌లో వివరాలను నమోదు చేసుకోవాలి. ఈ నెల 23వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. మరిన్ని వివరాల కోసం 9121087421 నంబర్‌ను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA