Manthani: మద్యపానం పై ఉక్కు పాదం మోపిన గ్రామస్తులు
Manthani: పెద్దపల్లి జిల్లా మంథని మండలం గాజులపల్లి గ్రామసభలో ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రత్యేక ప్రణాళికపై సమీక్షించారు.
Manthani: మద్యపానం పై ఉక్కు పాదం మోపిన గ్రామస్తులు
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మండలం గాజులపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రత్యేక అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో గత 99 రోజుల కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులు, సాధించిన పురోగతిని గ్రామస్తులకు వివరించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ద్వారా లబ్ధి పొందుతున్న కుటుంబాలు, కొత్తగా అర్హత పొందిన లబ్ధిదారుల వివరాలను సభలో చదివి వినిపించారు.
గ్రామ సర్పంచ్ కారెంగల సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.పాల్గొని తమ శాఖలకు సంబంధించిన కార్యక్రమాలు, ప్రజలకు అందుబాటులో ఉన్న సేవలు, సంక్షేమ పథకాల వివరాలను వివరించారు. గ్రామంలో మద్యపానాన్ని నియంత్రించడం, యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడడం లక్ష్యంగా గ్రామసభలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
గ్రామ పరిధిలో బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. గత ఐదు రోజుల క్రితం మంథని లోని ఎక్సైజ్ శాఖ అధికారులకు గ్రామంలోని బెల్ట్ షాపులను మూసి వేయించాలని వినతిపత్రం గ్రామపంచాయతీ పాలకవర్గం అందించినట్లు తెలిపారు. ఎవరూ బెల్ట్ షాపులు నిర్వహించరాదని, గ్రామ ప్రజలందరూ ఈ నిర్ణయానికి సహకరించాలని సభలో పిలుపునిచ్చారు.
ఈ గ్రామసభలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, యువకులు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఇలాంటి కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా కొనసాగించాలని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.




