Gambhiraopet: గంభీరావుపేటలో కలకలం రేపిన భారీ కొండచిలువ

Gambhiraopet: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో 8 అడుగుల భారీ కొండచిలువ ప్రత్యక్షం. అటవీ సిబ్బంది సహకారంతో సురక్షితంగా బంధించి అడవిలో విడిచిపెట్టిన వైనం.

KALEEM, SIRICILLA
Published on: 17 Aug 2026 11:07 PM IST
Gambhiraopet
X

Gambhiraopet: గంభీరావుపేటలో కలకలం రేపిన భారీ కొండచిలువ

గంభీరావుపేట: గంభీరావుపేట మండల కేంద్రంలోని కటుకం మృత్యుంజయం పంతులు తోటలో సోమవారం భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. తోటలో కూలీలు పనులు చేస్తుండగా సుమారు 8 అడుగుల పొడవైన కొండచిలువ కనిపించడంతో వెంటనే కటకం మృత్యుంజయానికి సమాచారం అందించారు.

ఆయన కూలీలను అప్రమత్తం చేసి, పామును చంపకుండా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. నాగుల పంచమి రోజునే భారీ కొండచిలువ కనిపించడంతో అటవీ అధికారులకు సమాచారం ఇవ్వగా.. వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

అటవీ అధికారులు కొండచిలువను సురక్షితంగా బంధించి, పెద్దమ్మ ఫారెస్ట్ ప్రాంతంలోని అడవుల్లో వదిలేందుకు తీసుకువెళ్లారు.

ఈ సందర్భంగా అటవీ అధికారి మాట్లాడుతూ.. పాములు కనిపించినప్పుడు వాటిని చంపకుండా వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story