Gambhiraopet: 15 నెలల కుమారుడితో మహిళ అదృశ్యం పోలీసుల గాలింపు

Gambhiraopet: గంభీరావుపేటలో 15 నెలల కుమారుడితో అదృశ్యమైన బందెల నవిత (29). కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, ఆచూకీ తెలిస్తే తెలపాలని విజ్ఞప్తి.

KALEEM, SIRICILLA
Published on: 5 Nov 2026 8:11 PM IST
Gambhiraopet
X

Gambhiraopet: 15 నెలల కుమారుడితో మహిళ అదృశ్యం పోలీసుల గాలింపు

గంభీరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 29 ఏళ్ల మహిళ తన 15 నెలల కుమారుడితో కలిసి అదృశ్యమైంది. గోరంటాల గ్రామానికి చెందిన బందెల నవిత (29) నవంబర్ 4న ఉదయం 9 గంటల సమయంలో భర్త ప్రశాంత్‌తో చిన్నపాటి గొడవ అనంతరం ఇంటి నుంచి కుమారుడు హిమన్షుతో కలిసి బయటకు వెళ్లింది.

ఆ తర్వాత తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గంభీరావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహిళతో పాటు చిన్నారి ఆచూకీ కోసం వివరాలు సేకరిస్తున్నారు.

మహిళ బందెల నవిత లేదా ఆమె కుమారుడు హిమన్షు ఆచూకీ తెలిసిన వారు గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌ను లేదా సంబంధిత పోలీసు అధికారులను సంప్రదించాలని పోలీసులు కోరారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA