Gambhiraopet: గంభీరావుపేట ఎస్సైగా బాలరాజు బాధ్యతల స్వీకరణ!

Gambhiraopet: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల నూతన ఎస్సైగా బాలరాజు బాధ్యతల స్వీకరణ. శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని వెల్లడి.

KALEEM, SIRICILLA
Published on: 6 Nov 2026 2:51 PM IST
Gambhiraopet
X

Gambhiraopet: గంభీరావుపేట ఎస్సైగా బాలరాజు బాధ్యతల స్వీకరణ!

Gambhiraopet: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల నూతన ఎస్సైగా బాలరాజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఎస్సైగా పనిచేసిన శ్రీకాంత్‌ను ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేయడంతో ఆయన స్థానంలో బాలరాజును నియమించారు. 2014 బ్యాచ్‌కు చెందిన బాలరాజు మెదక్ జిల్లా రామాయంపేట నుంచి బదిలీపై గంభీరావుపేటకు వచ్చారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎల్లారెడ్డిపేట సర్కిల్ కార్యాలయంలో సీఐ ఓ.వెంకటేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేష్ నూతన ఎస్సైకి శుభాకాంక్షలు తెలియజేసి, మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు సమర్థవంతంగా కృషి చేయాలని సూచించారు. పోలీసు సిబ్బంది సైతం బాలరాజుకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్సై బాలరాజు మాట్లాడుతూ.. మండలంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటానని, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ పోలీసు సేవలు అందిస్తానని తెలిపారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA