Sircilla: గంభీరావుపేటలో బోరు మోటార్ల కేబుళ్ల చోరీ.. రైతులకు భారీ నష్టం
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో అర్ధరాత్రి వేళ దొంగలు రెచ్చిపోయారు.
Sircilla: గంభీరావుపేటలో బోరు మోటార్ల కేబుళ్ల చోరీ.. రైతులకు భారీ నష్టం
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో గుర్తుతెలియని దుండగులు రైతులకు భారీ నష్టం కలిగించారు. అర్థరాత్రి వేళ ఏకకాలంలో 11 బోరు మోటార్ల కేబుళ్లను దొంగిలించడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మండల కేంద్రంలోని సింగసముద్రం పెద్ద కాలువ ఆయకట్టు పరిధిలో ఉన్న పంట పొలాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్సై శ్రీకాంత్ పోలీసు సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. దొంగలు కేబుల్ వైర్లను లాక్కెళ్లిన ఆనవాళ్లను గుర్తించి వివరాలు సేకరించారు. బాధిత రైతులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఇటీవలే నారు పోసి సాగు పనులు ప్రారంభించిన సమయంలో కేబుళ్లు దొంగిలించబడటంతో పంటల సాగుకు అంతరాయం ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుండగులను త్వరగా పట్టుకుని తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.




