Gambhiraopet: ముస్తఫానగర్‌లో గర్భిణి ఉరివేసుకుని బలవన్మరణం

Gambhiraopet: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తఫానగర్‌లో నిండు గర్భిణి బొంతల లావణ్య ఉరివేసుకుని మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్సై శ్రీకాంత్.

KALEEM, SIRICILLA
Published on: 13 Aug 2026 11:06 PM IST
Gambhiraopet
X

Gambhiraopet: ముస్తఫానగర్‌లో గర్భిణి ఉరివేసుకుని బలవన్మరణం

గంభీరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొంతల లావణ్య (30) గురువారం సాయంత్రం ఉరి వేసుకుని మృతి చెందారు.

లావణ్య నిండు గర్భిణిగా ఉన్నట్లు సమాచారం. ఆమెకు భర్త సురేష్‌తో పాటు నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story