Karimnagar: కరీంనగర్‌లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్!
Karimnagar: కరీంనగర్ వన్‌టౌన్ పరిధిలోని కాపువాడలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు.
Karimnagar: కరీంనగర్‌లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్!
కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కాపువాడలోని ఒక ప్రైవేట్ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట (త్రీ కార్డ్స్) స్థావరంపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో బెట్టింగ్ రాయుళ్ల ఆట కట్టించి, భారీగా నగదు, వాహనాలను స్వాధీనం చేసుకున్నా కరీంనగర్ టాస్క్ఫోర్స్ పోలీసులు.
కేసు వివరాలు:
నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు కాపువాడలోని సదరు ప్రైవేట్ నివాసంపై దాడి చేశారు. డబ్బులు పణంగా పెట్టి జూదం ఆడుతున్న 12 మంది వ్యక్తులను అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న సొత్తు:
జూదరుల నుండి రూ. 37,670/- నగదును స్వాధీనం చేసుకున్నారు.వారి వద్ద ఉన్న 12 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు.
నిందితులకు సంబంధించిన వాహనాలు:
ఒక రెనాల్ట్ (Renault) కారు, 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న నగదు, మొబైల్ ఫోన్లు మరియు వాహనాలను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నగరంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.




