Saidapuram: మండలంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి, 9 మంది అరెస్ట్

Saidapuram: సైదాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని దాదిశెట్టిపల్లెలో పేకాట స్థావరంపై దాడి చేసి 9 మందిని అరెస్ట్ చేసి, నగదు, మొబైల్స్, బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.

Yellayya, Nellore
Published on: 8 Aug 2026 6:13 PM IST
Saidapuram
X

Saidapuram: మండలంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి, 9 మంది అరెస్ట్

సైదాపురం: పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై ఆకస్మిక దాడి – 9 మంది అరెస్ట్.....

సైదాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని దాదిశెట్టిపల్లె గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మికంగా దాడి....

ఈ దాడిలో పేకాట ఆడుతున్న 9 మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.4,160/- నగదు, 5 మొబైల్ ఫోన్లు మరియు 5 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.....

నిందితులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు....

జిల్లాలో నేరాల నియంత్రణలో భాగంగా పేకాట, మట్కా, గ్యాంబ్లింగ్, కోడిపందేలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై పోలీసులు నిరంతరం ప్రత్యేక నిఘా కొనసాగిస్తూ, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.....

ఈ సందర్భంగా జిల్లా పోలీసులు మాట్లాడుతూ, జిల్లాలో చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇటువంటి కార్యకలాపాలపై సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే డయల్-112 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ 93929 03413కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.....

ఈ దాడిలో సైదాపురం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.....

Yellayya, Nellore

Yellayya, Nellore

Next Story