Sircilla: సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు!

Sircilla: సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఎస్పీ మహేష్ బి. గితే ఘనంగా నిర్వహించి, బాపూజీ చిత్రపటానికి నివాళులర్పించారు.

KALEEM, SIRICILLA
Published on: 2 Oct 2026 12:39 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు!

Sircilla: మహాత్మా గాంధీజీ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అన్నారు. గాంధీజీ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీజీ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. సత్యం, అహింస మార్గాలను అనుసరిస్తూ గాంధీజీ దేశ ప్రజలకు మార్గదర్శకంగా నిలిచారని పేర్కొన్నారు.

నేటి యువత గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాలను అనుసరిస్తూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని ఎస్పీ సూచించారు. గాంధీజీ నమ్మిన సిద్ధాంతాలు, విలువలను నిబద్ధతతో ఆచరించడం వల్లే ఆయన కీర్తి, ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్‌ఐలు సురేష్, రమేష్, సీఐలు మోగిలి, మధుకర్, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA