Gangadhara: గంగాధర పోలీస్ స్టేషన్‌లో ఘన సన్మానం
Gangadhara: గంగాధర ఏఎస్ఐ మొగిలి మల్లేశంకు ఎస్‌ఐగా ప్రమోషన్.. రాజన్న సిరిసిల్ల జిల్లాకు బదిలీ, గంగాధర పీఎస్‌లో ఎస్‌ఐ వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఘన సన్మానం.
Gangadhara: గంగాధర పోలీస్ స్టేషన్‌లో ఘన సన్మానం
కరీంనగర్: గంగాధర పోలీస్ స్టేషన్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI)గా విధులు నిర్వహిస్తున్న మొగిలి మల్లేశం ఇటీవల సబ్ ఇన్‌స్పెక్టర్ (SI)గా పదోన్నతి పొంది సిరిసిల్ల టు బదిలీ అయ్యారు ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది ఘనంగా సత్కరించారు.
గంగాధర పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్‌ఐ శ్రీ వంశీకృష్ణ ఆధ్వర్యంలో మల్లేశంకు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, శ్రీ మొగిలి మల్లేశం తన సేవాకాలంలో నిజాయితీ, క్రమశిక్షణ, విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారని పేర్కొన్నారు.
పదోన్నతి పొందిన మల్లేశం మాట్లాడుతూ, తనకు సహకరించిన ఉన్నతాధికారులు, సహచర సిబ్బంది, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో గంగాధర పోలీస్ స్టేషన్ సిబ్బంది, అధికారులు మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని మల్లేశంకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.




