Gangadhara: గంగాధర బీజేపీ మండల కార్యవర్గ సమావేశం
Gangadhara: గంగాధరలో బీజేపీ కార్యవర్గ సమావేశం. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన నేతలు, సోమవారం సబ్‌స్టేషన్ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చిన బీజేపీ నాయకులు.
Gangadhara: గంగాధర బీజేపీ మండల కార్యవర్గ సమావేశం
గంగాధర: కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని మధురానగర్‌లో బీజేపీ గంగాధర మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షుడు పంజాల ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ కార్యక్రమాలు, రైతు సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన SIR కార్యక్రమాన్ని ప్రతి బూత్‌లో BLA-2లు, BLOల సహకారంతో విజయవంతం చేయాలని సూచించారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, కొత్త పెన్షన్ల అమలు, రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా వంటి అంశాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రజలు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే విశ్వాసం వ్యక్తం చేస్తూ, కార్యకర్తలు ఇప్పటి నుంచే కష్టపడి పనిచేయాలని సూచించారు.
అలాగే రైతుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం గంగాధర సబ్‌స్టేషన్ వద్ద నిర్వహించే బీజేపీ మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో చొప్పదండి అసెంబ్లీ కన్వీనర్ పెరుక శ్రవణ్ కుమార్, సర్పంచులు ఏట్టెపు కనకయ్య, మల్యాల వినయ్ సాగర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీపతి చంద్రశేఖర్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడవల్లి శశిధర్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు తుమ్ నారాయణ, సదాల భాస్కర్, ఇనుకొండ నరసింహారెడ్డి, పెంచాల రాములు, ఉప సర్పంచులు, మండల నాయకులు, సోషల్ మీడియా కో-కన్వీనర్ ఆకుల మనోహర్, వివిధ గ్రామాల బీజేపీ నాయకులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




