Gangadhara: గంగాధరకు డిగ్రీ కళాశాల మంజూరు
Gangadhara: కరీంనగర్ జిల్లా గంగాధరలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు కావడంపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
Gangadhara: గంగాధరకు డిగ్రీ కళాశాల మంజూరు
Gangadhara: కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల మంజూరు చేసిన సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, చొప్పదండి నియోజకవర్గ ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా డిగ్రీ కళాశాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల ఆకాంక్షలను గుర్తించి గంగాధర మండల కేంద్రానికి డిగ్రీ కళాశాల మంజూరు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా సుదూర ప్రాంతాలకు వెళ్లలేక ఉన్నత విద్యను మధ్యలోనే ఆపేస్తున్న విద్యార్థుల సమస్యను ప్రభుత్వం గుర్తించిందని పేర్కొన్నారు. విద్యార్థుల కోరిక మేరకు డిగ్రీ కళాశాల మంజూరు చేయడంతో పాటు కళాశాలకు శాశ్వత భవనం నిర్మాణానికి ఆమోదం తెలిపి, 29 పోస్టులను కూడా మంజూరు చేయడం విద్యా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేస్తోందన్నారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల తరఫున సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా చొప్పదండి నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్, ఇరిగేషన్ హబ్, ఇండస్ట్రియల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ప్రజల ఆశీర్వాదం, సహకారం ఇలాగే కొనసాగాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




