Gangadhara: అదనపు కట్న వేధింపులకు వివాహిత బలి!
Gangadhara: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గోపాల్రావుపల్లిలో ఘోరం. అదనపు కట్న వేధింపులు తాళలేక గడ్డిమందు సేవించి వివాహిత నాగరపు మమత (32) మృతి.
Gangadhara: అదనపు కట్న వేధింపులకు వివాహిత బలి!
గంగాధర: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గోపాల్రావుపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాగరపు లాస్య అలియాస్ నలువాల మమత (32) అనే వివాహిత అదనపు కట్న వేధింపులు తాళలేక గడ్డి మందు సేవించి చికిత్స పొందుతూ మృతి చెందింది.
వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతా కుంట మండలం సోమరం పేట గ్రామానికి చెందిన మమతకు ఎనిమిదేళ్ల క్రితం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గోపాల్ రావు పల్లి గ్రామానికి చెందిన నాగరపు అనిల్‌తో వివాహం జరిగింది. వివాహం అనంతరం భర్తతో పాటు అత్తింటి కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం ఆమెను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ నెల 25వ తేదీ సాయంత్రం మమత గడ్డి మందు సేవించినట్లు గ్రామస్థుల ద్వారా సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్‌లోని అపెక్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున 2:33 గంటలకు మృతి చెందింది. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు.
మృతురాలి తండ్రి నలువాల ఓదయ్య, ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్తతో పాటు మామ, అత్త, ఆడబిడ్డలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గంగాధర ఎస్సై బి. వంశీకృష్ణ తెలిపారు.




