Gangadhara: గంగాధర పీఏసీఎస్‌కు కేంద్ర రూ. 6 లక్షల గ్రాంట్!
Gangadhara: దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 10 వేల సహకార సంఘాలలో గంగాధర పీఏసీఎస్ చోటు దక్కించుకుందని ఎఫ్పీఓ రూ. 6 లక్షలు మంజూరయ్యాయని డీసీఓ రామానుజచార్యులు తెలిపారు.
Gangadhara: గంగాధర పీఏసీఎస్‌కు కేంద్ర రూ. 6 లక్షల గ్రాంట్!
గంగాధర: రైతుల భాగస్వామ్యం తోనే సహకార సంఘాల అభివృద్ధి సాధ్యం అవుతుందని DCO రామానుజచార్యులు అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా గంగాధర పాక్స్ చైర్మన్ దూలం బాలగౌడ్ అధ్యక్షతన PACS కార్యాలయం లో సహకార సంఘాల వారోత్సవాలు, రైతు ఉత్పత్తి దారుల సంస్థ సభ్యత్వ స్వీకారణ, అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ సహకార సంఘంలో అందుతున్న సేవలను వివరించాలని సూచించారు.
రైతుల భాగస్వామ్యం తో సహకార సంఘాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా 10 వేల సహకార సంఘాలను ఎంపిక చేసినట్లు, ఇందులో గంగాధర సహకారం సంఘం ఉన్నట్లు తెలిపారు. ఎఫ్పివో క్రింద ప్రభుత్వం సహకార సంఘానికి రూ. 6 లక్షలు మంజూరు చేసిందని తెలిపారు. ద్వారా రైతుల నుండి వాటాధనం స్వీకరించి, వారి భాగస్వామ్యం తో పెట్రోల్ పంప్, రైస్ మిల్, కోల్డ్ స్టోరేజ్ వంటి వాటిని ప్రారంభించవచ్చని తెలిపారు.




