Karimnagar: కరీంనగర్‌లో పోలీసుల ఆకస్మిక దాడి: మధురానగర్ పేకాట స్థావరంపై రైడ్.. ఆరుగురు అరెస్ట్!

Karimnagar: కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని మధురానగర్ గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి రూ. 15,590 స్వాధీనం చేసుకున్నారు.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 30 April 2026 7:44 AM IST
Karimnagar:
X

Karimnagar: కరీంనగర్‌లో పోలీసుల ఆకస్మిక దాడి: మధురానగర్ పేకాట స్థావరంపై రైడ్.. ఆరుగురు అరెస్ట్!: 

గంగాధర (కరీంనగర్): కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఒక ఇంటిలో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు గంగాధర ఎస్సై వంశీకృష్ణ తన సిబ్బందితో కలిసి మధురానగర్ గ్రామంలోని ఓ ఇంటిపై ఆకస్మికంగా రైడ్ నిర్వహించారు.

దాడి సమయంలో ఆరుగురు వ్యక్తులు పేకాట ఆడుతూ కనిపించగా, వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో మంగపేట గ్రామానికి చెందిన మల్యాల కొమురయ్య. మహమ్మద్ జాకీర్ హుస్సేన్. బైరీ కార్తీక్ రెడ్డి. మల్యాల నర్సయ్య. మరియు మధురానగర్ గ్రామానికి చెందిన కుంచాల ఏడుకొండలు. ముద్రకోల తిరుపతి గా గుర్తించారు.

వారి వద్ద నుండి పేకాట ముక్కలు మరియు నగదు రూ.15,590 స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story