Gangaram: గంగారం ఘనంగా మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ జన్మదినం

Gangaram: గంగారం ఇందిరమ్మ కాలనీలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసిన నాయకులు, కాలనీ వాసులు.

Srimanthula Kondal, Peddapalli
Published on: 15 July 2026 4:56 PM IST
Gangaram
X

Gangaram: గంగారం ఘనంగా మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ జన్మదినం

గంగారాం: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిత్యం ప్రజా శ్రేయస్సు కోరే నాయకుడు, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ జన్మదిన వేడుకలు గంగారం గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో ఘనంగా నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ నాయకుడు కూస సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో స్థానిక సర్పంచ్ రేకుల జ్యోతి రఘు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా మహిళల సమక్షంలో కేక్ కట్ చేసి, కాలనీ వాసులకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం యూత్ కాంగ్రెస్ నాయకుడు కూస సతీష్ మాట్లాడుతూ.. నిత్యం ప్రజల కోసం పరితపించే సారయ్య గౌడ్ గారు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో వారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.

​ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవుల తిరుపతి, కొనుకటి శ్రీకాంత్, ముస్కు శ్రీనివాస్, మిరియాల మల్లేష్, గొడుగు సతీష్, కాలనీ మహిళలు మరియు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story