Karimnagar: కరీంనగర్‌లో గంజాయి ముఠా అరెస్ట్.. టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి!

Karimnagar: కరీంనగర్ వావిలాలపల్లిలో గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 18 Jun 2026 12:54 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో గంజాయి ముఠా అరెస్ట్.. టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి!

​కరీంనగర్ : కరీంనగర్ నగరంలో గంజాయి విక్రయిస్తూ, సేవిస్తున్న ముఠాను, సీపీ గౌష్ ఆలం ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నగరంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వావిలాలపల్లి ప్రాంతంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న నమ్మదగిన సమాచారంతో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ నేతృత్వంలోని బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది.

​పోలీసుల తనిఖీల్లో గంజాయి విక్రయిస్తున్న ప్రధాన నిందితుడు బెజ్జంకి లోకేష్ (వయస్సు 22), తండ్రి: శ్రీనివాస్, నివాసం:గోపాల్‌పూర్, కరీంనగర్ రూరల్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడి వద్ద నుండి భారీగా నిషేధిత పదార్థాలను మరియు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.​ ప్రధాన నిందితుడు లోకేష్‌తో పాటు ఒకే గదిలో ఉంటున్న మరో ముగ్గురు వ్యక్తులను కూడా పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. తాము క్రమం తప్పకుండా గంజాయి సేవిస్తున్నట్లు సదరు యువకులు పోలీసుల విచారణలో అంగీకరించారు. ​పట్టుబడిన నిందితుడిని, స్వాధీనం చేసుకున్న గంజాయి, బైక్ మరియు మొబైల్ ఫోన్లను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపారు.

యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి వంటి మత్తుపదార్థాల విక్రేతలపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story