Manthani: మంథని నేతకు రాష్ట్రస్థాయి పదవి.. విశ్వకర్మ మహాసభ నియామకం

Manthani: భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన గర్రెపల్లి సత్యనారాయణ నియామకం.

SHANKAR, MANTHANI
Published on: 27 May 2026 5:24 PM IST
Manthani
X

Manthani: మంథని నేతకు రాష్ట్రస్థాయి పదవి.. విశ్వకర్మ మహాసభ నియామకం

మంథాని: భారత విశ్వకర్మ మహాసభ రాష్ట్ర కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన గర్రెపల్లి సత్యనారాయణను నియమిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు నౌండ్ల సంతోష్ చారి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి గర్రెపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ విశ్వకర్మ మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా మరింత బాధ్యత పెంచిందని, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని ఆయన తెలిపారు.

నూతనంగా ఎంపికైన కమిటీ సభ్యులకు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అశ్విని కుమార్, ప్రధాన కార్యదర్శి సుభాష్ చంద్ర బోస్, జాతీయ వ్యవహారాల అధ్యక్షుడు రామ్ రాజ్, జాతీయ యువజన విభాగం అధ్యక్షుడు దిలీప్ కుమార్ శర్మ, అడ్వైజరి కమిటీ సభ్యులు చిన్మయ చారి అభినందనలు తెలిపారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story