Peddapalli: కాల్వ శ్రీరాంపూర్ నూతన ఎస్సైగా గట్ల సుధాకర్ బాధ్యతల స్వీకరణ!
Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ నూతన ఎస్సైగా గట్ల సుధాకర్ బాధ్యతలు స్వీకరించారు.
Peddapalli: కాల్వ శ్రీరాంపూర్ నూతన ఎస్సైగా గట్ల సుధాకర్ బాధ్యతల స్వీకరణ!
పెద్దపల్లి నారాయణ స్కూల్ లో ఇన్వెస్టిచర్ సెరిమనీ: హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని సూర్య నగర్ కాలనీ లో నారాయణ స్కూల్లో ఘనంగా నిర్వహించిన ఇన్వెస్టిచర్ సెరిమనీ కార్యక్రమం లో హయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలు, సాష్‌లు ప్రదానం చేసి వారి బాధ్యతలను అధికారికంగా స్వీకరింపజేశారు. అనంతరం మాట్లాడుతూ, విద్యార్థి దశలో అలవర్చుకునే క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సమయపాలన, సేవాభావం భవిష్యత్ జీవితానికి బలమైన పునాది అవుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు విద్యలో ప్రతిభ కనబరచడమే కాకుండా నైతిక విలువలు, దేశభక్తి, సామాజిక బాధ్యతలను పెంపొందించుకొని సమాజానికి ఆదర్శప్రాయమైన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
పాఠశాలలు విద్యను అందించడంతో పాటు విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ సామర్థ్యాలను పెంపొందించే వేదికలుగా నిలవాలని ఆయన అన్నారు. ఇన్వెస్టిచర్ సెరిమనీ వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి బాధ్యతాయుతమైన నాయకత్వాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
అనంతరం పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు కళ్లెం నవజీవన్ రెడ్డి ఘన స్వాగతం పలికి, కార్యక్రమానికి హాజరైనందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంఉత్సాహభరిత వాతావరణంలోవిజయవంతంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల జనరల్ మేనేజర్ గోపాల్ రెడ్డి, AGM రవీంద్ర బాబు, ప్రిన్సిపాల్ లావణ్య,అడ్మిన్ ఆఫీసర్స్ అనంత చంద్ర శేఖర్ గౌడ్, బీజేపీ sc మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పారంద మహేష్, నాయకులు ఎర్ర శ్రీకాంత్, మరియు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




