Peddapalli: మూడు తరాల తర్వాత పుట్టిన ఆడపిల్ల!

Peddapalli: పెద్దపల్లి జిల్లా పుట్టపాక గ్రామంలో మూడు తరాల తర్వాత ఆడబిడ్డ జన్మించడంతో పండుగ వాతావరణం. మహాలక్ష్మిలా హారతులతో ఆహ్వానించిన కుటుంబ సభ్యులు.

SHANKAR, MANTHANI
Published on: 17 July 2026 1:04 PM IST
Peddapalli
X

Peddapalli: మూడు తరాల తర్వాత పుట్టిన ఆడపిల్ల!

Peddapalli: పెద్దపల్లి జిల్లా మంథని మండలం పుట్టపాక గ్రామంలో మూడు తరాల తర్వాత ఒక కుటుంబంలో ఆడబిడ్డ జన్మించడంతో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. గ్రామానికి చెందిన రంజిత్–జ్ఞాన ప్రసన్న దంపతులకు రెండో సంతానంగా ఆడబిడ్డ జన్మించింది. మొదటి సంతానంగా కుమారుడు జన్మించగా, మూడు తరాలుగా కుటుంబంలో ఆడపిల్ల లేకపోవడంతో ఈసారి పాప పుట్టడం కుటుంబ సభ్యులకు అపారమైన ఆనందాన్ని కలిగించింది.

ఆడబిడ్డ జన్మించి 19 రోజుల అనంతరం శుక్రవారం నవజాత శిశువును అత్తగారి ఇంటి నుంచి స్వగృహానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఇంటిని పూలతో అందంగా అలంకరించి, హారతులు పట్టి, చిన్నారిని కుడికాలుతో ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఘనంగా స్వాగతం పలికారు. ఆడబిడ్డను మహాలక్ష్మిగా భావించిన కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు చిన్నారికి ఆశీర్వాదాలు అందజేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. "ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి" అనే సందేశాన్ని చాటేలా నిర్వహించిన ఈ వేడుక గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆడబిడ్డ జననాన్ని పండుగలా జరుపుకున్న ఈ కుటుంబాన్ని గ్రామస్థులు అభినందించారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story