Peddapalli: రంగాపూర్‌లో కరెంట్ షాక్‌తో మేక మృతి.. నిరుపేద కుటుంబంలో విషాదం!

Peddapalli: పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామంలో కరెంట్ అధికారుల నిర్లక్ష్యంతో నిరుపేద మేకల కాపరి కోయడా శ్రీనివాస్ ఉపాధి కోల్పోయాడు.

RAJU, PEDDAPALLI
Published on: 15 Oct 2026 10:13 AM IST
Peddapalli
X

Peddapalli: రంగాపూర్‌లో కరెంట్ షాక్‌తో మేక మృతి.. నిరుపేద కుటుంబంలో విషాదం!

Peddapalli: పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామంలో పండుగ వేళ విషాదం చోటు చేసుకుంది. కరెంట్ అధికారుల నిర్లక్ష్యం ఓ నిరుపేద కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

రంగాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద మేకల కాపరి కోయడా శ్రీనివాస్ మేకలను మేపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గ్రామ శివారులో మేకలను మేపుతుండగా చెట్టు మీద వేలాడుతున్న తెగిపడిన కరెంట్ వైర్ ను మూగజీవి గమనించలేక మేత కోసం వెళ్లడంతో షాక్ తగిలి మేక అక్కడికక్కడే మృతి చెందింది.

పండుగ సందర్భంలో రూ.25 వేల విలువైన మేక చనిపోవడంతో కోయడా శ్రీనివాస్ కుటుంబం పూర్తిగా కన్నీరుమున్నీరవుతోంది. మేకలపైనే ఆధారపడి జీవిస్తున్న తమ కుటుంబాన్ని సంబంధిత కరెంట్ అధికారులు, ప్రభుత్వ అధికారులు ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI