Godavarikhani: గోదావరిఖని బిసిఐ చైర్మన్ రాజీనామా చేయాలి - ఏఐఎల్‌యు డిమాండ్
Godavarikhani: బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గోదావరిఖని కోర్టు ప్రాంగణంలో తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యురాలు శైలజ ఆధ్వర్యంలో న్యాయవాదుల నిరసన.
Godavarikhani: గోదావరిఖని బిసిఐ చైర్మన్ రాజీనామా చేయాలి - ఏఐఎల్‌యు డిమాండ్
గోదావరిఖని: తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యురాలు శైలజ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కోర్టు ప్రాంగణంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొని, న్యాయవాద వృత్తి గౌరవం, స్వాతంత్ర్యం మరియు హక్కులను కాపాడేందుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) అనేది దేశవ్యాప్తంగా న్యాయవాదుల వృత్తి ప్రమాణాలను పరిరక్షించడంతో పాటు న్యాయ విద్య, న్యాయ కళాశాలలు మరియు న్యాయవాద వృత్తి అభివృద్ధిని పర్యవేక్షించాల్సిన చట్టబద్ధమైన అత్యున్నత సంస్థ. ఇలాంటి ప్రతిష్ఠాత్మకమైన సంస్థ రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా, నిష్పాక్షికంగా మరియు న్యాయవాదుల ప్రయోజనాలను కాపాడే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
అయితే, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా తన పదవిని వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారనే తీవ్ర ఆరోపణలు న్యాయవాద వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. తన న్యాయవాది వృత్తిలో ఏకపక్ష నిర్ణయ సర్క్యులర్లు జారీ చేయడం, న్యాయవాదుల వృత్తి స్వాతంత్ర్యాన్ని మరియు గౌరవాన్ని దెబ్బతీసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి చర్యలు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నాయని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏ రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థ వ్యక్తిగత నిర్ణయ సంస్థ కాదు అని భవిష్యత్తు న్యాయవ్యవస్థల గౌరవ ప్రతిష్ట వంతం మైన తీర్పులను ఉద్దేశిస్తూ ,ఇది రాజ్యాంగబద్ధమైన మరియు చట్టబద్ధమైన వ్యవస్థలో న్యాయవాదుల వృత్తి ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత కలిగిన సంస్థ. అదేవిధంగా ఏ ఒక్క వ్యక్తి స్వప్రయోజనాలు, వ్యక్తిగత ఆధిపత్యం లేదా రాజకీయ ప్రభావాలకు ఈ సంస్థ వేదికగా మారకూడదు తుది నిర్ణయాలతో నేటి వర్తమాన యువ న్యాయవాదుల తరాల న్యాయవ్యవస్థ పై గౌరవప్రదమైన నమ్మకాలు పై సుదీర్ఘ నిర్ణయం ఉండే విధంగా చర్య చేపట్టాలి.
ఈ నేపథ్యంలో, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీ మనన్ కుమార్ మిశ్రా గారు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సమగ్ర ప్రక్షాళన చేపట్టి పారదర్శకత, జవాబుదారీతనం మరియు నిష్పాక్షికతను పునరుద్ధరించాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు.
“బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వ్యక్తుల స్వప్రయోజనాల కోసం కాదు — దేశంలోని ప్రతి న్యాయవాది గౌరవం, హక్కులు మరియు న్యాయ వృత్తి స్వాతంత్ర్యం కోసం.” గోదావరిఖని ప్రాంగణంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు జవాజి శ్రీనివాస్ గుడికందుల భూమయ్య ఎండి ఉమర్ దుడపక లింగస్వామి గొట్ట నరేష్ వెంకటేశ్వర్లు శ్రీలత రేష్మ సుజాత తిలక్ ఆసిఫ్ సతీష్ దామోదర్ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




