peddapalli: కేటీఆర్ సభ భయంతోనే లాభాల వాటా ప్రకటన: కొప్పుల
peddapalli: కేటీఆర్ సింగరేణి కార్మిక గర్జన భయంతోనే కాంగ్రెస్ సర్కార్ హడావుడిగా లాభాల వాటా ప్రకటించిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బాల్క సుమన్ విమర్శించారు.
peddapalli: కేటీఆర్ సభ భయంతోనే లాభాల వాటా ప్రకటన: కొప్పుల
పెద్దపల్లి జిల్లా: గోదావరిఖని సింగరేణి స్టేడియం గ్రౌండ్ లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, TBGKS అద్యక్షులు మిర్యాల రాజిరెడ్డితో కలిసి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ రేపు KTR సభ కంటే ముందు మనం లాభాల వాటా ప్రకటించకుంటే ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని భయపడే హడావిడిగా సమావేశం ఏర్పాటు చేసుకొని లాభాల వాటాను ప్రకటించారని తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించిన లాభాల వాటాలో ఈసారి కూడా 34 శాతం లాభాల వాటను ప్రకటించారని, దీంతో ప్రతి కార్మికునికి లక్షా 50 వేల పైచిలుకు మాత్రమే వస్తాయని, ప్రభుత్వం ప్రకటించిన లాభాల వాటాలో మోసాల కారణంగా సింగరేణి ఉద్యోగులు లక్షల రూపాయలు నష్ట పోతున్నారని స్పష్టం చేశారు.
అలాగే గతంలో అభివృద్ధి కోసమంటూ పక్కన పెట్టిన వేల కోట్ల రూపాయలను ఏమి చేశారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో జరిగిన కుంభకోణాల కారణంగా, టెండర్ లను బంధువులకు కట్ట బట్టే ఆలోచన మూలంగా సింగరేణిలో లాభాలు తగ్గాయని, బొగ్గు ఉత్పత్తి పడిపోయిందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగా కరెంట్ కోతలు మొదలయ్యాయని, విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బొగ్గును ఉత్పత్తి చేయలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే KCR ప్రభుత్వం ఉండి ఉంటే సింగరేణి సంస్థ ఉత్పత్తిలో ముందుభాగాన నిలిచేదని, కార్మికులు నేడు 3 లక్షల పైచిలుకు లాభాల వాట తీసుకునే వారిని అన్నారు.
అందుకే సింగరేణి సంస్థలో జరుగుతున్న కుంభకోణాలపై, కార్మికుల హక్కుల రక్షణ కోసం రేపు జరుగనున్న KTR సింగరేణి కార్మిక గర్జన బహిరంగ సభను కార్మికవర్గం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ మీడియా సమావేశంలో మాజీ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, BRS, TBGKS నాయకులు కౌశిక హరి , వ్యాల్ల హరీష్ రెడ్డి,ఏనుగు రవీందర్ రెడ్డి, మూల విజయారెడ్డి, మేకల సమ్మయ్య, నాయకులు పాల్గొన్నారు.




