Godavarikhani: నవ సమాజ నిర్మాణానికి యువత పోరాడాలి

Godavarikhani: గోదావరిఖని ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో ప్రగతిశీల యువజన సంఘం పెద్దపల్లి జిల్లా 9వ మహాసభ; నిరుద్యోగ, సామాజిక సమస్యలపై పోరాడాలని పిలుపు.

VIJAY, RAMAGUNDAM
Published on: 22 Nov 2026 6:28 PM IST
Godavarikhani
X

Godavarikhani: నవ సమాజ నిర్మాణానికి యువత పోరాడాలి

గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఐ ఎఫ్ టి యు కార్యాలయంలో ప్రగతిశీల యువజన సంఘం పెద్దపెల్లి జిల్లా 9వ మహాసభ నిర్వహించారు. ఈ మహాసభకు ముందుగా ప్రగతిశీల యువజన సంఘం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు కాసిపేట ధర్మేందర్ జెండావిష్కరణ చేయగా అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి మహాసభను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మోకాళ్ళ రమేష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోల లక్ష్మీనారాయణ హాజరై మహాసభ ఉద్దేశించి మాట్లాడారు..

దేశ నిర్మాణ పురోగమనానికి పునరుత్పత్తికి అవసరమైన మేధావులను, రచయితలను, శాస్త్రవేత్తలను, పరిశోధకులను ,కవులను, కళాకారులను సామాజికవేత్తలను యువతరం నుండి తయారు చేసుకోవాలి. జీవితంలో ఉత్సాహం ఉడుకు రక్తంలో ఉరకలు వేసే ఉజ్వలమైన శక్తి యువతరానికి ఉంది. ఉరిత్రాడును చిరునవ్వుతో స్వీకరించిన భగత్ సింగ్ బ్రిటీష్ పాలకులను ముప్పు తిప్పలు పెట్టిన ఆజాద్, అల్లూరి వారసత్వాన్ని స్వీకరించి PYL ముందుకు సాగుతోంది.

యువతరం తలుచుకుంటే అనేక అసమానతలతో కూడిన చీకటి వ్యవస్థను సైతం కూకటి వేళ్ళతో పెకిలించగల శక్తి యువతరానికి ఉన్నది. అన్యాయాలు అక్రమాలు అవినీతి స్వార్థాన్ని కులం మతం దురభిప్రాయాలు ద్వేషాలపై పోరాడే తరం యువకులది. మూఢ విశ్వాసాలు, ఆచారాలు, సనాతన పద్ధతులు, సినిమాల్లో అశ్లీల సాహిత్యం, ఆధ్యాత్మిక సంస్కృతికి వ్యతిరేకంగా సమరశీల పోరాటం చేస్తుంది.

ప్రగతిశీల యువకులు సమాజంలో మార్పుపై జరిగే పోరాటంలో చురుకైన పాత్రలు పోషిస్తూ యువతకు విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు రావాలని, మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, అత్యాచారాలపై నిరంతరం పోరాటాలు జరుపుతారు. రాజకీయ చైతన్యాన్ని నింపుతూ ప్రగతిశీల యువజన సంఘం (PYL) ఆవిర్భవించి 4 దశాబ్దాలు అవుతుంది. పోరాట పరవళ్ళు తొక్కుతూ ఎన్నెన్నో త్యాగాలకు వెన్ను చూపక నిరంతర ప్రయత్నాన్ని కొనసాగిస్తుంది.

ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి అమరులైన కా॥ మేకల రాజన్న, కత్తెరమల్ల పోచన్న, ఆరుముళ్ల భూమన్న, భూషిపాక రాజన్నల అమరత్వంతో మరింత ప్రగతిశీల ఉద్యమాలు ముందుకు సాగుతున్నాయి.

ప్రభుత్వ బిజెపి అధికారంలో ఉన్న ప్రభుత్వ ఆర్ఎస్ఎస్ హిందూ ఫాసిస్టు దేశంగా మార్చే ప్రయత్నాలను తీవ్రం చేసింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేపర్ లీగ్ బాధ్యతలు స్వీకరించడానికి యువతరం గల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రజా పోరాటాలను తీవ్రతరం చేసి అక్రమ అరెస్టులను లాఠీ చార్జీలను ఎదిరించి పోరాడుతుంది. చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని ఉద్యమిస్తున్నదినిరంతరం యువకులు సమస్యలపై పోరాడుతూనే, యువకుల బాధ్యతను గుర్తుచేస్తూ సమస్యల పరిష్కారానికి పూనుకుంటుంది.

విష సంస్కృతిని విడనాడాలని, చెడు వ్యసనాలను దూరం చేసుకోవాలని, సమాజ మార్పు కోసం పోరాడాలని, పాలకుల మోసపూరిత కుట్రలను ఎండగట్టి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుంది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే వరకు పోరాటాలను ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు

పి వై ఎల్ జిల్లా అధ్యక్షులు కాసిపేట ధర్మేందర్, అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు ఈ నరేష్. ,చిలుక శంకర్, తోకల రమేష్ ,ఆరుముళ్ల , బి. ఆనంద్,సమ్మెట తిరుపతి తిర్రీ బాలకృష్ణ, ఈదునూరి బాబు,బండి అశోక్,దూలంసతీష్, పోరండ్లరాజేందర్, ప్రేమ్‌కుమార్ నాయకులు ఈ రామకృష్ణ గుండేటి మల్లేశం ఐ రాజేశం కే జ్యోతి మెరుగు చంద్రయ్య పి స్వామి అరుణోదయ రాజన్న మాలెం తిరుపతి సృజన్ కుమార్ బండి అశోక్ కోడిపుంజుల భూమేష్ తదితరులు పాల్గొన్నారు.

VIJAY, RAMAGUNDAM

VIJAY, RAMAGUNDAM